![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-7 పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. అందులో నుండి కిరణ్ రాథోడ్, షకీల, దామిణి, రతిక ఇలా వరుసగా నలుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయి వెళ్ళిపోవడంతో శనివారం నాటి ఎపిసోడ్‌లో నాగార్జున ఇది బాయ్స్ హాస్టల్ లాగా మారిందని అన్నాడు. ఇక అయిదవ వారం శుభశ్రీ ఎలిమినేట్ అవ్వడంతో హౌజ్ లో ప్రియాంక జైన్, శోభా శెట్టి ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు.
గ్రాంఢ్ లాంచ్ లో భాగంగా ' టైగర్ నాగేశ్వరరావ్' ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ స్టేజ్ మీదకి హీరోయిన్ లతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక మాస్ మహారాజ్ కనపడేసరికి హౌజ్ అంతా ' ఓ' అంటూ అరుస్తారు. రవితేజకి అమర్ దీప్ ఫ్యాన్ కాబట్టి తను మోస్ట్ హ్యాపీగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత హీరో సిద్దార్థ్ హౌజ్ లోకి వచ్చి.. తన సినిమాలలోని పాటలని ఇంగ్లీష్ లో పాడుతూ.. కంటెస్టెంట్స్ కి తెలుగులో పాడమని గెస్ చేయమని ఒక గేమ్ ఆడించాడు. సిద్దార్థ్ నటించిన "చిన్న" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాడు. ఇక కంటెస్టెంట్స్ తో కలిసి సరదాగా ఆట, పాటలతో సిద్దార్థ్ అలరించాడు.
ఇక ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత గ్రాంఢ్ లాంచ్ మొదలయింది. అందులోకి పూజా మూర్తి, అశ్విని శ్రీ, నయని పావని ముగ్గురు అమ్మాయిలతో పాటుగా అంబటి అర్జున్, భోలే శావలి వచ్చారు. వీళ్ళ ఎంట్రీ తర్వాత హౌజ్ లో అమ్మాయిలతో కళకళలాడిందనే చెప్పాలి. వాళ్ళని చూసి ఇప్పుడు బాయ్స్ హాస్టల్ లా లేదు గర్ల్స్ హాస్టల్ లా ఉందన్నారు నాగార్జున. కొత్తగా వచ్చిన అమ్మాయిల్లో నయని పావనికి అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ అండ్ బోల్డ్ ఫోటోలతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది నయని పావని. అయితే మరొక కంటెస్టెంట్ పూజా మూర్తికి ఒక ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అదేంటంటే తను బిగ్ బాస్ సీజన్-7 మొదలయ్యిన రోజునే రావాలి కానీ గ్రాంఢ్ లాంచ్ కి ఒక్కరోజు ముందు వాళ్ళ నాన్న చనిపోయాడు. పూజా మూర్తి బిగ్ బాస్ లోకి వెళ్ళి బాగా ఆడాలని, తనని హౌజ్ లో చూడాలనేది వాళ్ళ నాన్న కల అని చెప్తూ ఎమోషనల్ అయింది. ఇక తండ్రి చనిపోయిన బాధతో ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి ఎలా ఆడుతుందో, ప్రేక్షకులని మెప్పిస్తుందో లేదో చూడాలి.
![]() |
![]() |